Nara Bhuvaneshwari: వైసీపీ చేసే తప్పులను చంద్రబాబుపై నెట్టేస్తున్నారు

Nara Bhuvaneshwari: రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు దుర్మార్గపు ప్రభుత్వంతో సై అంటే సై అన్నట్లు పోరాడాలి

Jyothi
Published on: 5 April 2024 10:46 AM IST
Nara Bhuvaneshwari Comments On YCP
X

Nara Bhuvaneshwari: వైసీపీ చేసే తప్పులను చంద్రబాబుపై నెట్టేస్తున్నారు

Nara Bhuvaneshwari: నంద్యాల జిల్లాలో చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక గుండె పోటుతో మృతి చెందిన టీడీపీ అభిమాని కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. పాణ్యం మండలం భూపానపాడు గ్రామానికి చెందిన శివరామ్ అనే వ్యక్తి చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక గుండె పోటుతో మృతి చెందాడు. శివరామ్ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని భువనేశ్వరి అన్నారు.

వృద్దులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు ఇవ్వడంలో విఫలమయ్యారని భువనేశ్వరి అన్నారు. ఎన్నికల కమిషన్ వలంటీర్లను నిలిపేస్తే దాన్ని చంద్రబాబుపై నెట్టాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు.సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నా...వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టి దుర్మార్గపు రాజకీయాలకు తెరలేపిందన్నారు. రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని భువనేశ్వరి అన్నారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు దుర్మార్గపు ప్రభుత్వంతో సై అంటే సై అన్నట్లు పోరాడాలి ఆమె అన్నారు.

Jyothi

Jyothi

Next Story