గుంటూరు జిల్లాలో వ్యక్తి హత్య

admin1
Published on: 24 Nov 2019 4:02 PM IST
గుంటూరు జిల్లాలో వ్యక్తి హత్య
X
ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మంగళగిరి రూరల్ మండలం నవులూరులోని పుట్టతోట దగ్గర మూడంతస్తుల బిల్డింగ్ లో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి మంగళగిరిలోని అన్నమలై ట్రాన్స్ పోర్టు కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న మురుగేషన్ అని తెలిపారు. క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ తో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపటినట్లు పోలీసులు తెలిపారు.



admin1

admin1

Next Story