Gudivada: తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

గత 20 ఏళ్లుగా గుడివాడ మున్సిపాలిటీలు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న 15మందిని తొలగించారు.

S. Srikanth
Published on: 3 Feb 2020 4:09 PM IST
Gudivada: తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
X

గుడివాడ: గత 20 ఏళ్లుగా గుడివాడ మున్సిపాలిటీలు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న 15మందిని తొలగించారని, వీరిని విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని కోరారు.

ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు ఎం.వేణు శివకుమార్ మాట్లాడుతూ ..న్సిపల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని విధుల్లోకి తీసుకున్నారని అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. విషయాన్ని మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.


S. Srikanth

S. Srikanth

Next Story