Mumbai: హోంమినిస్టర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

Mumbai:ముంబై మాజీ సీపీ ఆరోపణలతో రంగంలోకి ఈడీ! * అనిల్ దేశ్‌ముఖ్‌పై మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్ చేసే ఛాన్స్

Sandeep Eggoju
Published on: 22 March 2021 12:28 PM IST
Mumbai Ex CP Allegation Case Latest Update
X

మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ (ఫైల్ ఫోటో)

Maharashtra: మహారా‌ష్ట్ర హోంమినిస్టర్ అనిల్‌ దేశ్‌ముఖ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసే ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబై మాజీ పోలీస్ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. నెలకు వంద కోట్ల రూపాయలు వసూళ్లు చేసి ఇవ్వాలని అడిగేవారని ఆరోపించారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు రేగాయి. ఇప్పటికే అతన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈడీ చర్యలకు ఉపక్రమిస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story