Mudragada: ఈనెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ

Mudragada: వైసీపీలో ముద్రగడ రోల్‌పై ఉత్కంఠ

Jyothi
Published on: 10 March 2024 11:21 AM IST
Mudragada will join YCP on 14th of this month
X

Mudragada: ఈనెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ

Mudragada: ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు తెలిసింది. తాడేపల్లిలో సీఎం సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ర్యాలీగా వెళ్లి వైసీపీలో జాయినింగ్ ఉంటుందని అనుచరులకు ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story