Mudragada: మీ నిర్ణయాలు మీ చేతిలో ఉండవు.. పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ లేఖ

Mudragada: మీ పార్టీ పోటీచేసే 24 మంది అభ్యర్థులకు నా అవసరం రాకూడదని.. భగవంతుడిని ప్రార్థిస్తున్నా

Shekhar G
Updated on: 29 Feb 2024 1:30 PM IST
Mudragada Letter To Pawan Kalyan
X

Mudragada: మీ నిర్ణయాలు మీ చేతిలో ఉండవు.. పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ లేఖ

Mudragada: పవన్‌ కల్యాణ్‌కు కాపునేత ముద్రగడ లేఖ రాశారు. గత అనుభవాలు, అవమానాలు మరిచి మీతో కలిసి పనిచేయాలని అనుకున్నానని తెలిపారు. కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని కోరుకున్నానని.. కానీ మీరు ఆ ఆలోచనలో లేరని అన్నారు. కిర్లంపూడి వస్తానని చెప్పించి రాలేదన్న ముద్రగడ.. పవన్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని... ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకుని రావాలని సెటైర్లు వేశారు.

ప్రజలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారన్న ముద్రగడ... 80 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి కూటమిలో పవర్ షేరింగ్‌ కోసం ప్రయత్నం చేసే సాహసం చేయలేకపోయారని విమర్శించారు. జనసేన పోటీచేసే 24 మంది అభ్యర్థులకు తన అవసరం రాదు.. రాకూడదని.. భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ పవన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.

Shekhar G

Shekhar G

Next Story