MP Raghurama Krishnam Raju writes letter to CM Jagan: సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ

MP Raghurama Krishnam Raju writes letter to CM Jagan: సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ
x
MP Raghurama krishnam raju writes letter to Cm jagan
Highlights

MP Raghurama Krishnam Raju writes letter to CM Jagan: సీఎం జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

MP Raghurama Krishnam Raju writes letter to CM Jagan: సీఎం జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2005 లో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. అయితే రాష్ట్ర పునర్విభజన జరిగిన తరువాత మళ్ళీ కమిటీలు వెయ్యలేదని అన్నారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి కొత్తూరు గోశాలలో వంద ఆవులు విష ప్రయోగం వలన చనిపోయాయని, ఆవులు, దూడల సంరక్షణ హిందువుల హృదయాలకు దగ్గరగా ఉంటుందన్న ఆయన అన్ని వర్గాలు, అధికారులతో కలిపి గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చెయ్యాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు.

కాగా అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు చేసిన తర్వాత పలు అంశాలపై జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన కూడా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారని.. సీఎం జగన్ కు లేఖ రాసారాయన. భవన నిర్మాణ కార్మికుల పేర్లను ఆధార్ తో లింక్ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కూడా సీఎం జగన్ కు లేఖలు రాశారు రఘురామకృష్ణంరాజు.

Show Full Article
Print Article
Next Story
More Stories