Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుపై వైసీపీ చర్యలు.. అనర్హత పిటిషన్ వేసేందుకు రంగంసిద్ధం

Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుపై వైసీపీ చర్యలు.. అనర్హత పిటిషన్ వేసేందుకు రంగంసిద్ధం
x
Highlights

YCP ready to suspend Raghu Rama Krishna Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలకు వైసీపీ సిద్ధమవుతోంది. షోకాజ్ నోటీస్‌‌పై రఘురామకృష్ణంరాజు...

YCP ready to suspend Raghu Rama Krishna Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలకు వైసీపీ సిద్ధమవుతోంది. షోకాజ్ నోటీస్‌‌పై రఘురామకృష్ణంరాజు స్పందించిన తీరుపై ఆగ్రహంతో ఉన్న అధిష్టానం ఇక, ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా, రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటేయాలంటూ త్వరలో లోక్‌సభ స్పీకర్‌కు పిటిషన్‌ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

రఘురామ కృష్ణంరాజు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్‌ సభ్యుడు. తొలిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రాజు, కొన్ని రోజుల తర్వాతే వైసీపీకే కొరకురాని కొయ్యగా మారారు. ఢిల్లీలో బీజేపీతో అదేపనిగా ఆయన రాసుకుపూసుకు తిరిగడం పార్టీకి కోపం తెప్పించింది. అంతటితో ఆగకుండా వైసీపీ ప్రభుత్వం మీదే తీవ్ర ఆరోపణలు చేశారు. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. తిరుమల ఆస్తుల అమ్మకం ప్రతిపాదనను వ్యతిరేకించారు. వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ఇసుక దొంగలుగా మారారని నిప్పులు చెరిగారు. నరసాపురంలో తన గెలుపుకు జగన్ ఒక్కరే కారణం కాదని, తన పాత్రా వుందన్నారు. సీఎం జగన్‌ను కలవాలని ఎన్నిసార్లు అడిగినా అపాయింట్‌ ఇవ్వలేదన్నారు. వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ, వైసీపీలో ప్రకంపనలు సృష్టించారు రఘురామ.

Show Full Article
Print Article
Next Story
More Stories