ప్రజా ఆరోగ్యం పట్ల వైద్యులు శ్రద్ధ చూపాలి : ఎమ్మెల్యే

ప్రజారోగ్యం పట్ల వైద్యులు శ్రద్ధ చూపాలని పేదలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ సూచించారు.

S. Srikanth
Published on: 5 Dec 2019 12:34 PM IST
ప్రజా ఆరోగ్యం పట్ల వైద్యులు శ్రద్ధ చూపాలి : ఎమ్మెల్యే
X
సమావేశంలో మాట్లాడుతున్న ఎం ఎల్ ఏ వసంత కృష్ణ ప్రసాద్

మైలవరం: ప్రజారోగ్యం పట్ల వైద్యులు శ్రద్ధ చూపాలని పేదలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ సూచించారు. మైలవరం హాస్పటల్ అభివృద్ధి కమిటి సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ముందుగా మైలవరం ప్రభుత్వాసు పత్రి గురించి వైద్యాదికారిని అడిగి తెలుసుకున్నారు.

శానిటేషన్, మంచి నీటి సౌకర్యం, వైద్య సిబ్బంది పనితీరు, సిబ్బంది కోరత తదితర విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది దైవంతో సమానమని రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని, సిబ్బంది కోరత లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హాస్పటల్ అభివృద్ధి కమిటి నిధులు గురించి అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు గురించి చర్చించారు.


S. Srikanth

S. Srikanth

Next Story