Tada: గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

Tada: గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
x
Highlights

మండలం పరిధిలోని కారిజాత, పాములమిట్ట పంచాయతీలలో సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పర్యటించారు.

తడ: మండలం పరిధిలోని కారిజాత, పాములమిట్ట పంచాయతీలలో సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పర్యటించారు. ఈ సందర్భంగా కారిజాత, పాములమిట్ట పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలను పరిశీలించారు. స్వయంగా గడపగడపకు వెళ్లి ప్రజలకు ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో తడ మండలంలో అభివృద్ధి అనేది శూన్యమని, గత ప్రభుత్వం నాయకులకు తెలిసింది దోచుకున్న తినడమే అని దుయ్యబట్టారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని అన్నారు. కారిజాత, పాములమిట్టలో ప్రతి సమస్యను తీరుస్తానని అన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల కోసం మన ముఖ్యమంత్రి జగన్ అన్న ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారని, ఆ నిధులతో గ్రామాల రూపురేఖలు మారుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories