ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్‌ నోట్‌ను క్షుణ్ణంగా చదవండి: ఎమ్మెల్యే

ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్‌నోట్‌ను క్షుణంగా చదివితే అసలు బండారం బయటపడుతుందని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

S. Srikanth
Published on: 17 Feb 2020 5:45 PM IST
ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్‌ నోట్‌ను క్షుణ్ణంగా చదవండి: ఎమ్మెల్యే
X

విశాఖపట్నం: ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్‌నోట్‌ను క్షుణంగా చదివితే అసలు బండారం బయటపడుతుందని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి బాగోతంపై ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతో టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. ప్రెస్‌నోట్‌లో రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరగాయని పేర్కొంటే.. ఎక్కడ రెండు వేల కోట్లు ఉన్నాయని యనమల రామకృష్ణుడు అంటున్నారని దుయ్యబట్టారు. యనమలను స్వయం ప్రకటిత మేధావిగా అమర్‌నాథ్‌ అభివర్ణించారు.

యనమలకు పంటి నొప్పితో పాటు కంటి చూపు కూడా పోయిందని అన్నారు. ఐటీ ప్రెస్‌ నోట్‌ ఇచ్చింది వైసీపీ కాదని..కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. రెండు వేల కోట్ల టర్నోవర్‌ లేని కంపెనీలు పెట్టి ఆర్థిక లావాదేవీలు జరిపారని.. స్పష్టంగా ప్రెస్‌ నోట్‌లో ఐటీ అధికారులు పేర్నొన్నారని అన్నారు. ఐటీ దాడులపై చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story