Complaint Against MP Raghurama Krishnam Raju : ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

Arun Chilukuri
Published on: 9 July 2020 12:59 PM IST
Complaint Against MP Raghurama Krishnam Raju : ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
X
YSRCP MP Raghurama Krishnam Raju (file photo)

Complaint Against MP Raghurama Krishnam Raju : నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కు మధ్య వివాదం ముదిరింది. ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేసారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన ఎంపీ రఘురామకృష్ణరాజు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భీమవరం పీఎస్ కు, జిల్లా ఎస్పీ కి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.

కాగా నిన్న పోడూరు పీఎస్‌లో ఇదే రీతిలో మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు చేశారు. మంత్రి శ్రీరంగనాథరాజు ఎంపీపై పోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఎంపీ వ్యాఖ్యలు తన పరువు నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. రఘు రామకృష్ణ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న ఇళ్ల పథకంలో స్థలాల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, కొనుగోళ్లలో కూడా గోల్‌మాల్‌ జరుగుతోందని గతంలో రఘురామ కృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story