Roja: బావ కళ్లల్లో ఆనందం కోసమే బాలయ్య మీసం తిప్పారు

Roja: ఈ మీసం తిప్పడం, తొడలు కొట్టడం ఏదో తన తండ్రి ఎన్టీఆర్‌పై.. చెప్పులు విసిరినప్పుడు చేసి ఉంటే బాగుండేది

Shekhar G
Published on: 21 Sept 2023 2:35 PM IST
Minister Roja Fires On MLA Balakrishna
X

Roja: బావ కళ్లల్లో ఆనందం కోసమే బాలయ్య మీసం తిప్పారు

Roja: ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం మెలేయడంపై మంత్రి రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బావ కళ్లల్లో ఆనందం కోసమే బాలయ్య మీసం తిప్పారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను సినిమా సెట్టింగ్ అనుకుని తిప్పారేమో అంటూ ఎద్దేవా చేశారు. ఈ మీసం తిప్పడం, తొడలు కొట్టడం ఏదో తన తండ్రి ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరినప్పుడు చేసి ఉంటే బాగుండేది అన్నారు. తన తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు సకాలంలో స్పందించి ఉంటే ఎన్టీఆర్ ఆత్మకు శాంతికలిగేదని మంత్రి రోజా అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story