RK Roja: టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే.. 2024లో జగనన్న వన్స్ మోర్ అని...

RK Roja: టీడీపీ నేతలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 21 March 2023 6:31 PM IST
Minister RK Roja Slams TDP Leaders
X

RK Roja: టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే.. 2024లో జగనన్న వన్స్ మోర్ అని...

RK Roja: టీడీపీ నేతలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. 2019 నుండి ఎక్కడా గెలవకపోడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారన్నారు. టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయన్నారు. టీడీపీ నేతలు అహంకారంతో అసెంబ్లీ స్పీకర్‌ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరమన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే అని అన్నారు. 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారని చెప్పారు.

టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు రోజా. జీవో నంబర్‌-1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చారా?. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీవో నంబర్‌-1 తీసుకొచ్చాం. జీవో నంబర్‌-1 ప్రజలకు రక్షణ కల్పించడానికే అని అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని చురకలు అంటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story