Dharmana: 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి జిల్లాకు ఏం చేశారో చెప్పాలి.. టీడీపీపై విమర్శలు కురిపించిన మంత్రి

Dharmana Prasada Rao: చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాను చులకనగా చూశారు

Shekhar G
Published on: 26 Aug 2023 2:47 PM IST
Minister Dharmana Criticized TDP And Chandrababu
X

Dharmana: 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి జిల్లాకు ఏం చేశారో చెప్పాలి.. టీడీపీపై విమర్శలు కురిపించిన మంత్రి

Dharmana Prasada Rao: తాను భూములు దోచేశానని ఆరోపిస్తున్నారని తన దగ్గర భూములు ఉంటే టీడీపీ వాళ్లే తీసుకోవచ్చని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తానేంటో తన క్యారెక్టరేంటో ప్రజలందరికీ తెలుసునన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు. శ్రీకాకుళం జిల్లా అంటే చంద్రబాబుకు చులకన అన్నారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని మంత్ర ధర్మాన అన్నారు. పెట్రో, డీజిల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story