Botsa Satyanarayana: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై మంత్రి బొత్స విమర్శనాస్త్రాలు

Botsa Satyanarayana: మొత్తం 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయం

Shekhar G
Published on: 11 March 2024 7:38 PM IST
Minister Botsa Satyanarayana Criticized The TDP Janasena And BJP Alliance
X

Botsa Satyanarayana: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై మంత్రి బొత్స విమర్శనాస్త్రాలు

Botsa Satyanarayana: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పై అధికార వైసీపీ నుంచి మాటల దాడి కొనసాగుతూనే ఉంది. మూడు పార్టీల అలయన్స్ పై... తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ రియాక్ట్ అయ్యారు. గతంలో పొత్తు పెట్టుకున్న ఆ మూడు పార్టీలు.. ఆ తర్వాత చాలా తిట్టుకున్నాయని..బీజేపీ నేతలైతే ఏకంగా..చంద్రబాబును కట్టప్పతో పోల్చిన విషయాన్ని ప్రస్తావించారు బొత్స. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని.. అలయన్స్ కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారాయన. ఇక నాలుగు వైసీపీ సిద్ధం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో వైసీపీ గెలవడం ఖాయమన్నారు బొత్స.

Shekhar G

Shekhar G

Next Story