శ్రీశైల శిఖరానికి మందరాడ తలపాగా

శివరాత్రి పర్వదినాన శ్రీశైల క్షేత్రంలో మల్లిఖార్జునునికి తలపాగ సమర్పించేందుకు మందరాడ చేనేత కార్మికులకు జిల్లా కలక్టరు అనుమతినిచ్చారు.

S. Srikanth
Published on: 10 Feb 2020 6:27 PM IST
శ్రీశైల శిఖరానికి మందరాడ తలపాగా
X

రాజాం: శివరాత్రి పర్వదినాన శ్రీశైల క్షేత్రంలో మల్లిఖార్జునునికి తలపాగ సమర్పించేందుకు మందరాడ చేనేత కార్మికులకు జిల్లా కలక్టరు అనుమతినిచ్చారు. 208 మీటర్ల ఈ తలపాగను అత్యంత నిష్టతో నేతన్నలు నేశారు. స్వామికి ఈ తలపాగాను శ్రీశైలంలో స్వామికి 21-2-2020 తేదీన అలంకరిస్తారు. ఈ సందర్భంగా మందరాడ గ్రామంలో భక్తులు స్వామికి సమర్పించే తలపాగాను సోమవారం ఉదయం ఊరేగించారు. ఈ ఊరేగింపులో మందరాడ మాజీ ఎంపీటీసీ వావిలపల్లి శ్రీనివాస నాయుడు, మాజీ సర్పంచి శ్రీమతి సాయి లత, గ్రామస్తులు పాల్గొన్నారు.

తమకు ఈ అనుమతి ఇచ్చిన జిల్లా కలక్టర్ నివాస్, సహకరించిన మందరాడ మాజీ ఎంపీటీసీ శ్రీ వావిలపల్లి శ్రీనివాస నాయుడు, సహాయ సంచాలకులు చేనేత జౌళి శాఖ శ్రీకాకుళం, మందరాడ చేనేత సహకార సంఘం సభ్యులకు చిన్నా రావు బృందం కృతజ్ఞతలు తెలిపింది. తాము శ్రీశైలం చేరుకునే ముందు తమ గ్రామంతో సహా పలు గ్రామాల్లో తలపాగ తిరువీధి జరుపుతామని, తమ భజన బృందానికి తిరుమలలో భజన చేసే అవకాశం కూడా గతంలో లభించిందని చిన్నారావు తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story