Buddha Prasad: జనసేనలోకి మండలి బుద్ద ప్రసాద్

Buddha Prasad: పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయింపు

Jyothi
Published on: 1 April 2024 10:15 AM IST
Mandali Buddha Prasad into Janasena
X

Buddha Prasad: జనసేనలోకి మండలి బుద్ద ప్రసాద్

Buddha Prasad: ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ ఇవాళ జనసేన పార్టీలో చేరనున్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బుద్ధప్రసాద్‌కు ఇప్పటికే అవనిగడ్డ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ స్థానం జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బుద్ధ ప్రసాద్‌ను బరిలోకి దింపాలని జనసేన అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది.

1999, 2004, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడం కూడా ఇందుకు మరో కారణం. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అవనిగడ్డను తన ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తోంది. ఇక, మచిలీపట్టణం లోక్‌సభ స్థానానికి కూటమి నుంచి బరిలోకి దిగిన వల్లభనేని బాలశౌరికి జనసేన టికెట్ కేటాయించడం వెనక మండలి బుద్ధప్రసాద్ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.

Jyothi

Jyothi

Next Story