ఎలుకల మందు రుచిచూసిన పాస్టర్..గాల్లో కలిసిన ప్రాణాలు

కె.హెచ్. బాబు
Updated on: 16 Jun 2019 6:03 PM IST
ఎలుకల మందు రుచిచూసిన పాస్టర్..గాల్లో కలిసిన ప్రాణాలు
X

ఎలుకల నివారణ మందు పనిచేస్తుందో లేదో అంటూ రుచిచూసి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చత్తీస్ ఘడ్ రాష్ర్టం జాస్పూర్ జిల్లాకు చెందిన రాబర్ట్ కస్పోటా కొంత కాలం క్రితం కృష్ణా జిల్లా ముసునూరులో ఉంటూ మనసున్నలయంలో పాస్టర్ గా శిక్షణ పొందుతున్నాడు. ఇక్కడ ఎలుకలు ఎక్కవగా ఉండటంతో నివారణకోసం మందు తీసుకు వచ్చారు. ఈ మందు పని చేస్తుందో లేదో అని నాలుకపై వేసుకొని రుచి చూశాడు. వాంతులు కావడంతో నూజివీడు అమెరికన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.


కె.హెచ్. బాబు

కె.హెచ్. బాబు

Next Story