Gajuwaka: అనధికారికంగా శానిటైజర్ల తయారీ

S. Srikanth
Updated on: 7 April 2020 12:12 PM IST
Gajuwaka: అనధికారికంగా శానిటైజర్ల తయారీ
X
Representational Image

గాజువాక: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా శానిటైజర్లను తయారు చేస్తున్న ఓ వ్యక్తిని న్యూ పోర్టు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ పైడపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖనగరంలోని బీసీరోడ్డులో ఉన్న గోల్డెన్‌ పాలిమర్స్‌, కెమికల్స్‌ కార్పొరేషన్‌ గోదాములో నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లతో కలిసి పోలీసులు దాడి చేశారు.

గోదాము యజమాని అబ్దుల్‌ బాయిష్‌ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.2.50లక్షలు విలువ చేసే శానిటైజర్‌ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.

S. Srikanth

S. Srikanth

Next Story