Srisailam: శ్రీశైలంలో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు

Srisailam: సంబరాన్ని అంటిన శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు

Jyothi
Published on: 15 Jan 2024 8:19 AM IST
Makara Sankranti Celebrations in Srisailam
X

Srisailam: శ్రీశైలంలో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు 

Srisailam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. మూడోరోజు భ్రమరాంభాసమేతుడైన మల్లికార్జునస్వామి రావణ వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో వేకువజామునుంచే వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుద్దీపకాంతుల నడుమ కన్నుల పండవగా ఆలయ ప్రదక్షిణలు చేయించారు.

ఆలయ ప్రధాన రాజగోపురం గుండా రావణవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఊరేగించారు. పురవీధుల్లో స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా... భక్తులు పాల్గొన్నారు. శివనామస్మరణతో శ్రీశైలం మార్మోగింది. శ్రీశైలం ఆలయం అంతా విద్యాద్దీపకాంతులతో మిరమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది.

Jyothi

Jyothi

Next Story