Srisailam: శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Shekhar G
Published on: 1 March 2024 1:53 PM IST
Mahashivratri Brahmotsavam Started In Srisailam Temple
X

Srisailam: శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 11 వరకు 11 రోజులపాటు జరగనున్నాయి. ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు,ఆలయ చైర్మన్ ఉత్సవాలను ప్రారంభించారు. అర్చకులు వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ,శివసంకల్పం, చండీశ్వరపూజ,కంకణాధారణ,అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు.

అలానే భక్తులకు 30 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచారు. నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామి అమ్మ వార్లను దర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివ స్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story