Maha Shivaratri 2026 Live Updates: తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Maha Shivaratri 2026 Live Updates: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ శివయ్య దర్శనానికి బారులు తీరారు.

Maha Shivaratri 2026 Live Updates: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ శివయ్య దర్శనానికి బారులు తీరారు. ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, వేములవాడ, శ్రీకాళహస్తిలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




Live Updates

  • 15 Feb 2026 1:40 PM IST

    Maha Shivaratri 2026 Live Updates: సంగారెడ్డి ఝారసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా బారులు తీరిన భక్త్తులు.

  • 15 Feb 2026 1:40 PM IST

    Maha Shivaratri 2026 Live Updates: కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు.

    ఉదయం 2 గంటలనుండే భక్తుల తాకిడి మొదలైంది.

    వి.ఐ.పి లకు అధిక ప్రధాన్యత ఇస్తున్నారని సామాన్యల భక్తులు అందోలన

    ఉదయం 2 నుండి క్యూలైనలో ఉన్నామని కాని లైన్ కదలడం లేని అందోలన

    ఆలయ ఈఓ, చైర్మెన్ డౌన్ డౌన్ అని భక్తలు నినాదాలు

  • 15 Feb 2026 1:39 PM IST

    Maha Shivaratri 2026 Live Updates: వేములవాడ లో వైభవోపేతంగా శివరాత్రి ఉత్సవాలు

    స్వామి వారికి సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ

    రాష్ట్ర ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలను సమర్పించనున్నా మంత్రులు …

    శివరాత్రి సందర్భంగా ఈరోజు వేములవాడ లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం… మహా లింగర్చాన …

    వేములవాడ రాజన్న ఆలయంలో ఇంకా అబివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భీమన్న ఆలయంలోనే ఈసారి శివరాత్రి వేడుకలు



  • 15 Feb 2026 1:38 PM IST

    Maha Shivaratri 2026 Live Updates: ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

    మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు భక్తులు

    మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్య రావడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాటు చేసిన కార్యనిర్వహణ అధికారి సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల ముండయ్య

  • 15 Feb 2026 1:37 PM IST

    గంగాధర మండలం బొమ్మలమ్మ గుట్ట సమీప శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల భారీ రద్దీ

    ఉదయం నుంచే బారులు తీరిన భక్తులు

    స్వామివారి దర్శనానికి దీర్ఘ క్యూలైన్లు

    ప్రత్యేక అభిషేకాలు, పూజలు కొనసాగింపు

  • 15 Feb 2026 1:30 PM IST

    Maha Shivaratri 2026 Live Updates: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తజనం

     భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లు

    శివనామ స్మరణతో మార్మోగిన వేములవాడ ఆలయ పరిసరాలు

    రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్న రాష్ట్ర బి సి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

  • 15 Feb 2026 1:30 PM IST

    Maha Shivaratri 2026 Live Updates: సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో మహాశివరాత్రి సందర్భంగా కిటకిటలా ఆడుతున్న శివాలయాలు..

    శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్న భక్తులు

  • 15 Feb 2026 1:29 PM IST

    Maha Shivaratri 2026 Live Updates: నంద్యాల జిల్లా : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

    ఉదయం 2:30 నుంచి స్వామి వారి దర్శనాలకు అనుమతిస్తున్న అధికారులు.

    స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరినారు భక్తులు.

    మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 10:30 నుండి పాగా అలంకరణ,స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం


    భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు

  • 15 Feb 2026 1:28 PM IST

    Maha Shivaratri 2026 Live Updates: విశాఖ లో శివాలయాల్లో ప్రత్యేక పూజలు..

    బీచ్ రోడ్ లో కోటి లింగాల మహా కుంభబిషేకం...

    సముద్ర స్నానాలు చేస్తున్న భక్తులు...

  • 15 Feb 2026 1:27 PM IST

    Maha Shivaratri 2026 Live Updates: వరంగల్...ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణతో మారిన్ రోగి పోతున్న శైవ క్షేత్రాలు... ఉదయం నుండి శివయ్యకు అభిషేకం చేసేందుకు బారులు తీరిన భక్తులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story