టీడీపీకి షాక్ తప్పదు.. పది మంది జంప్ గ్యారెంటీ టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Samba Siva Rao
Published on: 6 Jun 2020 9:04 PM IST
టీడీపీకి షాక్ తప్పదు.. పది మంది జంప్ గ్యారెంటీ టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
Maddali Giridhara Rao (File Photo)

ఏపీలో పది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ దూరమైన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సంచలన వయాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు... టీడీపీలో ఏం జరుగుతుందో అధినేత చంద్రబాబు తెలుసుకోలేకపోతున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

టీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ముగ్గురు ఈపాటికే పార్టీకి దూరమయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం టీడీపీకి దూరంగా ఉంటున్నారు.మంత్రి కొడాలి నాని ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష పదవి కూడా కొన్నిరోజుల్లో పోతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story