విజయవాడలో మరోసారి లాక్ డౌన్

విజయవాడలో మరోసారి లాక్ డౌన్
x
Highlights

విజయవాడలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరగుతుండటంతో నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించారు. మొత్తం 64 డివిజన్లలో 42 కంటైన్మెంట్...

విజయవాడలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరగుతుండటంతో నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించారు. మొత్తం 64 డివిజన్లలో 42 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్న కలెక్టర్ ప్రజలంతా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. మెడికల్ , రెవెన్యూ, పోలీస్ అధికారుల పర్యవేక్షణలో కంటైన్మెంట్ జోన్లు ఉంటాయని కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories