Lockdown in Kadapa: రేపట్నుంచి కర్నూలు జిల్లాలో లాక్ డౌన్.. ఆంక్షలు మరింత కఠినతరం!

Lockdown in Kadapa: రేపట్నుంచి కర్నూలు జిల్లాలో లాక్ డౌన్.. ఆంక్షలు మరింత కఠినతరం!
x
kadapa (File photo)
Highlights

Lockdown in Kadapa: ఏపీలో కరోనా వ్యాప్తి లెక్కలు చూస్తే గుండెలు గుభేల్ అంటున్నాయి. మొదటి వెయ్యి, తరువాత రెండు వేలు, తరువాత నాలుగు వేలు. ప్రస్తుతం ఏకంగా 8 వేల

Lockdown in Kadapa: ఏపీలో కరోనా వ్యాప్తి లెక్కలు చూస్తే గుండెలు గుభేల్ అంటున్నాయి. మొదటి వెయ్యి, తరువాత రెండు వేలు, తరువాత నాలుగు వేలు. ప్రస్తుతం ఏకంగా 8 వేల వరకు రోజుకు కేసులు నమోదవుతుండటంతో జనాలు హడలి పోతున్నారు. వీరితో పాటు అధికారులు సైతం దీనిని కట్టడి చేసేందుకు వీలైనంత మేర చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కడపలో రేపట్నుంచి లాక్ డౌన్ ప్రారంభం కానుంది.

కడప జిల్లాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. శనివారం (జూలై 25) ఒక్కరోజే ఆ జిల్లాలో 294 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి అక్కడ కరోనా కేసుల సంఖ్య 4361కి చేరుకుంది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో కరోనాని కంట్రోల్ చేసే దిశగా అధికారాలు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే రేపటినుంచి లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉదయం 10 గంటల వరకే షాపులను తెరవాలని, 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని వెల్లడించారు.

ఇక అటు తూర్పు గోదావ‌రి జిల్లాలో కూడా కోవిడ్ కేసులు విప‌రీతంగా నమోదు అవుతున్న క్రమంలో అక్కడ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. స‌న్ డే ఉద‌యం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం6 గంట‌ల వ‌ర‌కూ పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించారు. కాగా గ‌త ఆదివారం కూడా ఇలానే క‌ర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. ఇక అటు ప్రజలు కూడా స్వయంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. అటు కరోనా విషయంలో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో ఉంది.

ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి .. శనివారం నాటికి ఉన్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో 7,813 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 53,681 శాంపిల్స్‌ని పరీక్షించగా 7,813 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 3,208 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories