Mandapeta: మండపేటలో మొదలైన నామినేషన్ ప్రక్రియ

ఈ నెల 23వ తేదీన జరిగే ఎంపీటీసీ ఎన్నికల సంబంధించి మండపేటలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది.

S. Srikanth
Published on: 9 March 2020 2:38 PM IST
Mandapeta: మండపేటలో మొదలైన నామినేషన్ ప్రక్రియ
X

మండపేట: ఈ నెల 23వ తేదీన జరిగే ఎంపీటీసీ ఎన్నికల సంబంధించి మండపేటలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సోమవారం నుండి నామినేషన్లు సేకరణ కార్యక్రమం చేపట్టడంతో మండపేట మండలంలోని ఏడిద సీతానగరం గ్రామానికి చెందిన అయినంపూడి సుబ్బలక్ష్మి టీడీపీ అభ్యర్థిగా తమ నామినే షన్లను మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రఘురామ్ కు సమర్పించారు.

ఏడిద సీతానగరం, మర్రిపాడు గ్రామాలకు కలిపి ఈ ఎంపీటీసీ స్థానంలో ఉండగా ఆ సీటును జనరల్ మహిళకు కేటాయించారు దాంతో సుబ్బలక్ష్మి తమ నామినేషన్లను అట్టహాసంగా దాఖలు చేశారు. ఈ ఎంపీటీసీ స్థానం లో 2430 ఓట్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాజీ ఎంపీటీసీ సభ్యులు రమేష్ రాజు, నంబూరి రామరాజు నంబూరు లక్ష్మీనారాయణ రాజు, హిందూపూర్ శ్రీనివాస రాజు, సుబ్బారావు పార్టీ ప్రతినిధులు భాస్కర్ రావు, టి.వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story