Andhrapradesh: ఎల్ఐసి ఏజెంట్ లకు కమిషన్ పెంచాలని నిరసన

S. Srikanth
Published on: 11 Jan 2020 11:55 AM IST
Andhrapradesh: ఎల్ఐసి ఏజెంట్ లకు కమిషన్ పెంచాలని నిరసన
X

కదిరి: ఎల్ఐసి ఏజెంట్ లు కమిషన్ పెంచాలని కోరుతూ స్థానిక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పలువురు ఎల్ఐసి ఏజెంట్ లు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ ల కమిషన్ పెంచకపోవడం, పాలసీదారుల పై జిఎస్టి ఎక్కువ వేయడం.

బోనస్ తగ్గించడం లాంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు.1956లో ఎల్ఐసి సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఏజెంట్లకు కమీషన్ పెంచలేదన్నారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్ ఆఫ్ ఇండియా తమ సమస్యలను పరిష్కరించేందుకు జగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ లు పాల్గొన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story