దేశవ్యాప్త బంద్ లో పాల్గొన్న వామపక్షాలు

దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పార్వతీపురంలో జరిగిన నిరసనల్లో సీపీఎం, సీపీఐ, సిఐటియు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

S. Srikanth
Published on: 8 Jan 2020 2:49 PM IST
దేశవ్యాప్త బంద్ లో పాల్గొన్న వామపక్షాలు
X

పార్వతీపురం: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పార్వతీపురంలో జరిగిన నిరసనల్లో సీపీఎం, సీపీఐ, సిఐటియు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా సీపీఎం కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివెళ్లారు.

ఉద్యోగ, ఉపాద్యాయ, రైతులు సమస్యలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వెంటనే పరిష్కరించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొని కార్మిక వర్గాన్ని అణచే నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలియజేసారు.

S. Srikanth

S. Srikanth

Next Story