అవినీతి నిర్మూలనకు సీఎం జగన్‌ మరో చారిత్రాత్మక నిర్ణయం

admin1
Published on: 25 Nov 2019 6:18 PM IST
అవినీతి నిర్మూలనకు సీఎం జగన్‌ మరో చారిత్రాత్మక నిర్ణయం
X
సీఎం జగన్‌

ఏపీలో అవినీతి నిర్మూలనకు సీఎం జగన్‌ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అనినీతిపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్‌ హెల్ప్‌లైన్‌ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్‌ నేరుగా కాల్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసి పనితీరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే 14400కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజుల నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.




admin1

admin1

Next Story