KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి.. ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ..

KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి.. ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ..
KRMB: నాగార్జునసాగర్ వివాదంపై ఏపీ సర్కార్‌కు KRMB లేఖ రాసింది.
KRMB: నాగార్జునసాగర్ వివాదంపై ఏపీ సర్కార్‌కు KRMB లేఖ రాసింది. సాగర్‌ను ఆక్రమించారని తెలంగాణ తమకు ఫిర్యాదు చేసిందని లేఖలో తెలిపింది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. కుడికాల్వకు నీటి విడుదలను వెంటనే ఆపాలని ఆదేశించింది. 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం సరికాదన్న KRMB.. ఏపీకి మూడు విడతల్లో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. 2024 జనవరి, ఏప్రిల్‌లో నీటిని విడుదల చేయాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది KRMB.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్‌కు తక్షణమే నీటి విడుదల ఆపేయాలని KRMB ఏపీకి ఆదేశాలిచ్చింది. సాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పందం కుదిరింది. అక్టోబర్ 10 నుంచి 20 వరకు 5 టీఎంసీలు, జనవరి 8 నుంచి 18 వరకు మరో 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుంచి 24 వరకు మరో 5 టీఎంసీలు వాడుకునే విధంగా ఇరురాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నీటిని ఎలా విడుదల చేశారంటూ ఏపీ ప్రభుత్వంపై KRMB అసహనం వ్యక్తం చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



