ఇప్పటికే ఎక్కువ నీటిని వాడుకున్నారు..ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ!

ఇప్పటికే ఎక్కువ నీటిని వాడుకున్నారు..ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ!
x
Highlights

కేటాయింపులను దాటి ఇప్పటికే కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. మేనెల వరకూ చేసిన కేటాయింపులను...

కేటాయింపులను దాటి ఇప్పటికే కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. మేనెల వరకూ చేసిన కేటాయింపులను మించి ఇప్పటికే వాదేసుకున్నరనీ, ఇక నీటి వాడకాన్ని ఆపేయాలనీ ఆదేశించింది.

సాగర్‌ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయొద్దని పేర్కొంది. ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం ఈ లేఖను రాశారు. నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని ఆ లేఖలో తెలిపారు.

ఇప్పటివరకూ ఏపీ ఎంత నీటిని వాడుకుందని కృష్ణా బోర్డు చెప్పిందంటే..

- సాగర్ కుడి కాల్వ ద్వారా 158.255 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటికే 158.264 టీఎంసీల నీటిని వాడుకుంది.

- హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 48.328 టీఎంసీల నీటిని తీసుకుంది.

- రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని బోర్డు అభిప్రాయపడింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories