Narsipatnam: 18న కొట్టం శ్రీ కోటమాంబ సిరిమాను మహోత్సవం

Narsipatnam: 18న కొట్టం శ్రీ కోటమాంబ సిరిమాను మహోత్సవం
x
Highlights

కొట్టాం, శ్రీ కోటమాంబ సిరిమాను మహోత్సవం ఈ నెల 18వ తారీకు బుధవారం నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నర్సీపట్నం: కొట్టాం, శ్రీ కోటమాంబ సిరిమాను మహోత్సవం ఈ నెల 18వ తారీకు బుధవారం నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శానాపతి జగన్నాథం మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 16వ తారీకు సోమవారం తొలేలు పండగ, 17 వ తారీఖు మంగళవారం పాలదార, అనుపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరములకు ఒకసారి నిర్వహించే సినిమాను మహోత్సవం బుధవారం ఉంటుందని అన్నారు.

ఈ సిరిమాను ఉపయోగించే చెట్టు ఏ ఊరిలో ఉన్నది పూజారి కలలో అమ్మవారు చెప్తారని అన్నారు. ఈ సంవత్సరం వేపాడ మండల, డబ్బరేస్ పేటలో ఉందని ఉత్సవ పూజారి రండి నాగభూషణం చెప్పారని తెలిపారు. ఈ సిరిమాను మహోత్సవమునకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తారన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ కోటమ్మ తల్లి ప్రసిద్ధి చెందడంతో ప్రతి మంగళవారం, ఆదివారాల్లో వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలోనే వంటలు చేసుకుని తింటారని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories