MLA Jaggireddy : ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా!

coronavirus
MLA Jaggireddy : కరోనా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతున్నారు.
MLA Jaggireddy : కరోనా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఇక ఏపీలో కూడా పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా అయన కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా అందులో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్ ఉండి, వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ అవసరం లేదని జగ్గిరెడ్డి తెలిపారు. అయితే తనకి నెగెటివ్ వచ్చే వరకు తనను ఎవరూ కలువోద్దని వెల్లడించారు. ఇక గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కరొనా పరీక్షలు చేసుకోవాలని అయన వెల్లడించారు.
ఇక అటు ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.. శనివారం నాటికి ఉన్న సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 10,548 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక 8,976 మంది డిశ్చార్జ్ అయ్యారు. 78 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ 4,14,164 కేసులు నమోదు అయ్యాయి.. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,12,687కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 97,681 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 36,03,345 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం. అటు ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,796 గా ఉంది.