Home > ఆంధ్రప్రదేశ్ > Koppana Mohan Rao Passed Away: మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు కన్నుమూత
Koppana Mohan Rao Passed Away: మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు కన్నుమూత

X
Highlights
koppana mohan rao passed away: మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు(75) కన్నుమూశారు. అనారోగ్యంతో...
Arun Chilukuri30 July 2020 4:48 AM GMT
koppana mohan rao passed away: మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు(75) కన్నుమూశారు. అనారోగ్యంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరికి చెందిన ఆయన 1978, 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. ఇటీవల వైసీపీలో చేరి పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2019 ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
Web Titlekoppana Mohan Rao passed away
Next Story