Visakhapatnam: సీఎం సహాయనిధికి కిమ్స్‌, శ్రీచైతన్య విరాళాలు

కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా కిమ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించింది.

S. Srikanth
Published on: 7 April 2020 9:48 AM IST
Visakhapatnam: సీఎం సహాయనిధికి కిమ్స్‌, శ్రీచైతన్య విరాళాలు
X

విశాఖపట్నం: కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా కిమ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించింది. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం కిమ్స్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.భాస్కర్‌రావు చెక్కును అందజేశారు.

అలాగే కరోనా నివారణ చర్యల కోసం తమ వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు శ్రీ చైతన్య యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ శ్రీధర్ సీఎం జగన్‌ను కలిసి చెక్కును అందజేశారు.

S. Srikanth

S. Srikanth

Next Story