NTR District: నడిరోడ్డుపై సినీ ఫక్కీలో యువకుడి కిడ్నాప్.. బాధితుడు కూడా మహాముదురే..!

NTR District: స్థానికుల సమాచారంతో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Shekhar G
Published on: 17 Aug 2023 12:48 PM IST
Kidnap In Ntr District Ibrahimpatnam
X

NTR District: నడిరోడ్డుపై సినీ ఫక్కీలో యువకుడి కిడ్నాప్.. బాధితుడు కూడా మహాముదురే..!

NTR District: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సినీ ఫక్కీలో కిడ్నాప్ జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కారులో ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి గంపలగూడెం మండలం వినగడపకు చెందినట్లు గుర్తించారు పోలీసులు. అతను ఉద్యోగాల పేరుతో ఇబ్రహీంపట్నంలో పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వారి దగ్గర నుంచి 28 లక్షల రూపాయల దాకా వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత యువకుడిన ఉద్యోగాల గురించి ప్రశ్నింగా ముఖం చాటేశాడు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగితే సరిగా స్పందించలేదు. దాంతో కిడ్నాప్‌కు యత్నించారు బాధితులు.

Shekhar G

Shekhar G

Next Story