TTD Key Decision: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

TTD Key Decision: 2024-25 సంవత్సరానికి బడ్జెట్‌ ఆమోదించిన బోర్డు

Shekhar G
Published on: 29 Jan 2024 2:05 PM IST
Key Decisions of TTD Governing Council
X

TTD Key Decision: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

TTD Key Decision: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 సంవత్సరానికి 5 వేల, 141కోట్ల 74 లక్షల వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోద ముద్ర వేసింది. పోటు కార్మికులను స్కిల్డ్‌ లేబర్‌గా గుర్తిస్తూ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వేదవిద్యా వ్యాప్తి అధ్యాపకుల వేతనం 51వేలకు పెంపు, 1400 మంది వేద పండితులకు పెన్షన్‌ 12వేలకు పెంపు, టీటీడీ అనుబంధ ఆలయాల్లో విధులు నిర్వహించే..అర్చకుల వేతనం 31వేలకు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక స్విమ్స్‌ ఆస్పత్రిని 1200 పడకలకు పెంచాలని, ఫిబ్రవరి 3,4,5వ తేదీల్లో తిరుమల ఆస్థానంలో ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.

Shekhar G

Shekhar G

Next Story