Tirumala: శ్రీవారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

Tirumala: దీపావళి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానన్నారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2024 3:00 PM IST
Kanchi Peetadhipati Vijayendra Saraswathi Visited Tirumala
X

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

Tirumala: దీపావళి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానన్నారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. ఇవాళ తిరుమలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కంచి పీఠాధిపతికి టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఈనెల 18వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు అయోధ్యలో లక్ష చండీయాగం నిర్వహించనున్నామని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి వెల్లడించారు. ఈ యాగానికి టీటీడీ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.. కొత్త పాలక మండలికి శ్రీవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story