Kakinada: మత్స్యకారులకు జాక్‌పాట్.. 25 కేజీల కచిడి చేప.. రూ.3.30 లక్షలకు దక్కించుకున్న వ్యాపారి జిలాని

Kakinada: కచిడి చేప నుంచి తీసే పదార్థాలతో శస్త్రచికిత్స అనంతరం కుట్లుకు దారం తయారీ

Shekhar G
Published on: 22 July 2023 2:16 PM IST
Kakinada Fisherman Got 25 Kg Ghol Fish
X

Kakinada: మత్స్యకారులకు జాక్‌పాట్.. 25 కేజీల కచిడి చేప.. రూ.3.30 లక్షలకు దక్కించుకున్న వ్యాపారి జిలాని

Kakinada: సముద్రాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు అప్పుడప్పుడు అరుదైన చేపలు వలలో చిక్కుతూ ఉంటాయి. అత్యధిక బరువు కలిగి ఉండే పెద్ద పెద్ద చేపలు పట్టుబడుతూ ఉంటాయి. కొన్ని అరుదైన చేపలకు మార్కెట్‌లో విపరీతంగా డిమాండ్ ఉంటుంది. తాజాగా కాకినాడ మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. 20 కేజీల బరువు గల కచిడి చేప దొరికింది. ఈ చేపను 3.30 లక్షలకు మత్య్సకారులు విక్రయించారు. చేపలను కొనుగోలు చేసే వ్యాపారులు దీనిని కొనుగోలు చేశారు. అత్యంత అరుదుగా లభించే కచిడి చేపలో అనేక ఔషధ గుణాలు లభిస్తాయి.

అనేక వ్యాధులకు తయారుచేసే ఔషధాల్లో కచిడి చేపను ఉపయోగిస్తారు. పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా కచిడి చేప నుంచి తీసే పదార్థాలతో డాక్టర్లు ఆపరేషన్ చేసిన అనంతరం వేసే కుట్లుకు దారం తయారు చేస్తున్నారు. ఎన్నో అనారోగ్యాలకు మంచి ఔషధంగా ఈ చేప ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో ఈ చేపకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, కొనుగోలు చేసేందుకు పోటీ పడతారని డాక్టర్లు చెబుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story