కాసులు కురిపిస్తున్న కచిడి చేప

కాసులు కురిపిస్తున్న కచిడి చేప
x
Highlights

ఒక్క చేప దొరికితే చాలు మీరు లక్షాధికారి కావచ్చు. కాసులు కురిపించే చేప వలకు చిక్కితే చాలు మీ దశ తిరిగిపోతోంది. అలాంటి బంగారు చేప కోసం ప్రతి...

ఒక్క చేప దొరికితే చాలు మీరు లక్షాధికారి కావచ్చు. కాసులు కురిపించే చేప వలకు చిక్కితే చాలు మీ దశ తిరిగిపోతోంది. అలాంటి బంగారు చేప కోసం ప్రతి మత్స్యకారుడు ఈగర్‌గా వెయిట్‌ చేస్తాడు. అలాంటి అరుదైన చేప ఒకటి మత్స్యకారుడికి చిక్కి సిరులు కురిపించింది. ఆ చేప కథేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

ఆ చేప దొరికితే లక్షాధికారి కావచ్చా ?

ఒక్క చేపకు లక్షల్లో ధర ఉంటుందా ?

కాసులు కురిపిస్తున్న కచిడి చేప

అవును మీరు విన్నది నిజమే. నిజంగా అలాంటి చేప మత్స్యకారులకు పాలిట సిరుల చేపే. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ అరుదైన చేప ఓ గంగపుత్రుడిని లక్షాధికారిని చేసింది. 30 కేజీల బరువున్న కచిడీ చేప అలియాస్‌ గోల్డ్‌ఫిష్‌ చిక్కడంతో ఓ వ్యాపారి దాన్ని రెండు లక్షల రూపాయాలకు కొనుగోలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఒక్క చేప అంత ధర పలుకుతుందని ఆశ్చర్యపోతున్నారా. కచిడీ చేపల మామూలు చేప కాదు మత్స్యకారుల పాలిట బంగారు చేప. చేపలందు కచిడి చేపలు వేరయ్యా అన్నట్లు ఉంటుంది. అందుకే దీనిని సీ గోల్డ్‌ చేపగా పిలిస్తుంటారు. సముద్రంలో చాలా రేర్‌గా కనిపించే బంగారు చేప ఇటీవల మత్స్యకారుడి వలకు చిక్కి సిరులు కురిపించింది.

మార్కెట్‌లో సూపర్‌ ధర పలుకుతున్న ఈ చేపను ప్రొటోలిసియా డయాకాన్సన్‌ అనే సాంకేతిక నామంతో పిలుస్తుంటారు. ఒక చోట స్థిరంగా ఉండని ఈ చేపలో ఎన్నో ఔషతగుణాలతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. శస్త్రచికిత్సల తర్వాత కుట్లు వేసేందుకు వినియోగించే దారాన్ని ఈ చేప గాల్‌బ్లాడర్‌ నుంచే తయారు చేస్తారట. పైగా ఖరీదైన వైన్‌లోనూ ఈ లక్కి ఫిష్‌ మొక్క శరీర భాగాలను వినియోగిస్తుంటడంతో గోల్డ్‌ఫిష్‌ కాస్త కాస్ల్టీగా మారిపోయింది. లక్కు ఉన్నవాళ్లకే ఈ చేపలు దొరుకుతాయంటున్నారు మత్సకారులు. అలాంటి చేప ఒకటి తమకు దొరికితే తమ దశే తిరిగిపోతుందంటున్నారు. సిరులు కురిపించే చేప చాలా అరుదుగా కనిపిస్తుందంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories