విజయవాడలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సమావేశం.. సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై చర్చ

Vijayawada: సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం

Jyothi
Updated on: 11 March 2024 3:30 PM IST
Joint meeting of TDP, BJP and Janasena in Vijayawada
X

విజయవాడలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సమావేశం.. సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై చర్చ

Vijayawada: విజయవాడలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. సీట్ల సర్దుబాటు, మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై చర్చించనున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సీట్ల అంశంపై బీజేపీ జాతీయ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ మంతనాలు జరిపారు. నిన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఇవాళ మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. భేటీ అనంతరం సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story