Vijayawada: పెళ్లికి నిరాకరించాడని ప్రేయసి తండ్రిని హత్య చేసిన ప్రియుడు

Vijayawada: విజయవాడ బృందావన్‌‌కాలనీలో దారుణం చోటు చేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Jun 2024 12:31 PM IST
Jilted Lover Kills Girls Father in Vijayawada
X

Vijayawada: పెళ్లికి నిరాకరించాడని ప్రేయసి తండ్రిని హత్య చేసిన ప్రియుడు

Vijayawada: విజయవాడ బృందావన్‌‌కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించాడని ప్రేయసితండ్రిని ప్రియుడు హత్య చేశాడు. తన కూతురు వెంటపడొద్దని యువతి తండ్రి యువకుడిని హెచ్చరించాడు. దీంతో ప్రియురాలి తండ్రిపై పగబట్టిన ప్రియుడు.. శ్రీరామ్‌ప్రసాద్‌ వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్‌తో ఢీకొట్టాడు. కిందపడ్డ వెంటనే ప్రసాద్‌ను కత్తితో నరికిచంపాడు మణికంఠ.

అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీరామ్‌ప్రసాద్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story