టీటీడీ కొత్త ఈవోగా జవహర్ రెడ్డి?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) గా ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) గా ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9న ఆయన కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం లేదా శనివారం ఉదయం ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించేంతవరకూ టీటీడీ ఈవోగా అదనపు జేఈవో ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు.
కరోనా సంక్షోభ సమయంలో జవహర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండడంతో ఏపీ ప్రభుత్వం ఆయనను టీటీడీ ఈవోగా బదిలీ చేసినట్టు సమాచారం. కాగా అనిల్ కుమార్ సింఘాల్‌ను 2017 మే నెలలో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఇదిలావుంటే ధర్మారెడ్డి కూడా 2019 వరకూ కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఆయనను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి టీటీడీకి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.