రేపు తూర్పులో పవన్ పర్యటన

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం 10 గంటల కు మధురపూడి విమానాశ్రయం కు చేరుకుంటారు.

S. Srikanth
Published on: 7 Dec 2019 11:56 AM IST
రేపు తూర్పులో పవన్ పర్యటన
X
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

మండపేట: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం 10 గంటల కు మధురపూడి విమానాశ్రయం కు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్ మార్గంలో కడియం, జేగురు పాడు మీదుగా మండపేట నియోజకవర్గంలో వెలగ తోడు శివారు పంట పొలాల్లో రైతులతో చర్చిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుండి ఇప్పన పాడు చేరు చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడతారు.

అక్కడి నుండి బయలు దేరి మధ్యాన్నం 1 గంటకు మండపేట లోని బాబుఅండ్ బాబు కన్వర్షన్ హల్ కు చేరుతారు. మధ్యాన్నం భోజన విరామం అనంతరం 2 గంటలకు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమావేశంలో పాల్గొని పార్టీ కార్యక్రమలపై సమీక్షలు నిర్వహిస్తారు. వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని చర్చిస్తారు.

అనంతరం 5 గంటలకు ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తారు.అనంతరం రోడ్ మార్గాన అమరవతి తరలి వెళతారు. ఆయన వెంట పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు, తోట చంద్ర శేఖర్ లు పాల్గొననున్నారు. జిల్లా పర్యటన ఏర్పాట్లు జిల్లా అధ్యక్షులు పంతం నానా జీ, మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ లు పర్యవేక్షిస్తున్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story