Mandapeta: జనసేన నియోజకవర్గ స్ధాయి కార్యకర్తల సమావేశం

జనసేన నియోజకవర్గ స్థాయిలో అమలాపురం పార్లమెంటరీ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మండపేట జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ అధ్యక్షతన మండపేట కాపు కళ్యాణ మండపంలో జరిగింది.

S. Srikanth
Published on: 9 March 2020 1:30 PM IST
Mandapeta: జనసేన నియోజకవర్గ స్ధాయి కార్యకర్తల సమావేశం
X

మండపేట: జనసేన నియోజకవర్గ స్థాయిలో అమలాపురం పార్లమెంటరీ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మండపేట జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ అధ్యక్షతన మండపేట కాపు కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. నియోజకవర్గం లోనే మండపేట, రాయవరం మండలంలోని గ్రామాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేశారు. వారికి ఎన్నికలకు సంబంధించి విధి విధానాలను వివరించారు.

అనంతరం గెలుపుకు ఏ విధంగా కార్యకర్తలకు జన సైనికులను గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా సమయం తక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఎన్నికల రంగంలోకి దిగి ప్రచారంలో దూసుకుపోతూ అన్నారు పార్టీ ఆశయాలను ఆదర్శాలను స్థానిక సమస్యలను ప్రస్తావించి ఓటర్లను తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు రామారావు, నామాల చంద్ర రావు, డబ్బులు వాసిరెడ్డి అర్జున్, రవి తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story