భగవద్దర్శనానికి పవన్.. ఆయన కోసం పబ్లిక్!

జనసేనాని పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామిని ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంతర్వేది మొత్తం పవన్ అభిమానులతో కిక్కిరిసిపోయింది.

K V D Varma
Published on: 6 Sept 2019 3:51 PM IST
భగవద్దర్శనానికి పవన్.. ఆయన కోసం పబ్లిక్!
X

జనసేనాని పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లో పర్యటించారు. అంతర్వేదిలో కొలువై వున్నా లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ వర్గాలు ఘనస్వాగతం పలికాయి. స్వామి వారి దర్శనానంతరం పవన్ కు అర్చకులు వేదాశీర్వచనం పలికి.. తీర్థప్రసాదాలు అందచేశారు. అయితే, భగవంతుని దర్శనానికి వచ్చిన పవన్ కోసం ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అంతర్వేది చేరుకున్నారు. అభిమాన జన సంద్రంతో అంతర్వేది అంతా పవన్ నామస్మరణమే కనిపించింది. ఆలయానికి వెళ్ళే రహదారులన్నీ పవన్ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. పవన్ కళ్యాణ్ కారులోంచే తన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.


K V D Varma

K V D Varma

Next Story