విలక్షణమైన మోడీ నాయకత్వం మున్ముందు మరింత అవసరం : పవన్

విలక్షణమైన మోడీ నాయకత్వం మున్ముందు మరింత అవసరం : పవన్
x

 modi, pawan kalyan

Highlights

Pawan kalyan Wish To Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా మోడీ కి పలువురు రాజకీయ

Pawan kalyan Wish To Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా మోడీ కి పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా పవన్ ఒక లేఖను విడుదల చేశారు..

ప్రజాప్రతినిధులుగా ఎందరికో అవకాశం కల్పిస్తుంది మన పుణ్యభూమి. అయితే అందులో కొందరే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోతారు. వారి నిబద్ధత, సేవాతత్పరత, నిస్వార్థం, నిశ్చలత్వం, ధృడ సంకల్పం, ధృడ నిర్ణయం, దేశభక్తి వంటి ఉదాత్త లక్షణాలు కలవారికి ప్రటలు బ్రహ్మరథం పడతారు. అటువంటి ప్రజాపాలకులలో ఈతరంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అగ్రస్థానంలో ఉంటారు. బాల్యదశలోనే సామాజిక సేవకు ఆకర్షితులైన శ్రీ మోదీగారు ఆ సేవని నిర్విరామంగా కొ నసాగిస్తూ ఒక ధృడమైన నాయకునిగా రూపుదిద్దుకున్నారు. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో బన్మించి.. తేనీరు అమ్మే చిరువ్యాపారిగా జీవనం ప్రారంభించిన ఆయన జీవన ప్రయాణం ఆదర్శప్రాయం. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఆయన నిలువెత్తు నిదర్శనం.

తీవ్ర భూకంపంతో ఆతలాకుతలమైన దశలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఆ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన తీరు కొనయాడతగినది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విజయాలను శ్రీ మోదీ గారు నాయకత్వంలో గుజరాత్‌ దక్కించుకుంది. ఆ శక్తితోనే భారత ప్రధానిగా బాధ్యతలను స్వీకరించి భారత్‌ శాంతికాముక దేశమే కాదు, శత్రువులు కన్నెత్తి చూడలేని శక్తివంతమైన దేశమని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత శ్రీ మోదీ గారిని ప్రజలకు మరింత దగ్గర చేసింది. రెండోసారి కూడా ఆయనను అఖండ మెజారిటీతో ప్రజలు ప్రధాని పీఠంపై ఆయనను అధిష్టింప చేశారు.

మన దేశానికీ శ్రీ మోదీ గారి విలక్షణమైన నాయకత్వం మున్ముందు మరింత అవసరం. ఈ దేశీ ప్రల ఆశలు, ఆకాంక్షలు తీర్చడానికి సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పూర్ణాయుష్షును ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ 70 వ జన్మదినం సందర్భంగా నా తరపున, జనసేన పార్టీ తరపున ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories