Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత

Pawan Kalyan: రెండు రోజులుగా తీవ్ర జ్వరంతోనే పర్యటన

Jyothi
Published on: 1 April 2024 9:12 AM IST
Janasena Chief Pawan Kalyan Fell ill
X

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయభేరి షెడ్యూలును ముందస్తుగా ఖరారు చేయడంతో వాయిదా వేయడం ఇష్టంలేక హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నా వైద్యం పొందుతూనే రెండు రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీకారం చుట్టారు.

నిన్న శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన- తెదేపా- భాజపా నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అత్యవసర సమావేశం కోసం నిన్న సాయంత్రం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ వెళ్లిన పవన్‌కల్యాణ్‌.. సోమవారం ఉదయం మళ్లీ పిఠాపురం చేరుకుంటారని.. మిగిలిన రెండురోజుల పర్యటన పూర్తి చేస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.

Jyothi

Jyothi

Next Story