నామినేషన్ ప్రక్రియ మరొకసారి నిర్వహించాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan (file photo)
కరోనా వైరస్ కారణం గా ఎన్నికల సంఘం ఆరు వారలు ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ప్రక్రియలో జరిగిన వివరాలను వివరించారు.
ఎన్నికల్లో హింసా, దౌర్జన్యాలపై మేము చెప్పిందే నిజమైంది. నామినేషన్ సమయంలో చాల చోట్ల దాడులు జరిగాయి. అలాగే నామినేషన్ ప్రక్రియ మరొకసారి నిర్వహించాలి, ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఈ సారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి. లేకుంలే న్యాయస్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Next Story




